27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ట్రాఫిక్ జంక్షన్ ల ఏర్పాటుకు ప్రతిపాదనలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో తలెత్తుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను  నుడా చైర్మన్ కేశ వేణు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ ప్రవీణ్ పరిశీలించారు.


Proposals for the establishment of traffic junctions

నూతన ట్రాఫిక్ జంక్షన్ ల ఏ ర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. అలాగే వినాయక్ నగర్, బోధన్ రోడ్, గౌతం నగర్, హైదరాబాద్ బైపాస్ ఏరియాల్లో నీరు నిలిచే ప్రదేశాలను పరిశీలించి వర్షాకాలంలో ఇబ్బందులు ఎదురుకాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పెద్ద డ్రెయినేజీలను నిర్మించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కేశ వేణు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ , బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కృషితో స్మార్ట్ సిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వారి ఆధ్వర్యంలో నగరంతోపాటు జిల్లా అభివృద్ధి చెందుతోందని, ప్రజల తరుఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

More articles

Latest article