భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

0 4,229

మహిళా నేతలతో కలిసి బీఆర్ఎస్ రజతోత్సవ సభా ప్రాంగణం పరిశీలన

హనుమకొండ, బతుకమ్మ : హనుమకొండలోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కుంభమేళాను తలపించేలా జరగనుందన్నారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా నేతలతో కలిసి సభా ప్రాంగణం పరిశీలించడానికి వచ్చామన్నారు. సభా ప్రాంగణంలో మహిళల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలిస్తామన్నారు.  ఆమె వెంట మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, తదితరులున్నారు.

MLC Kavitha performs special pujas at Bhadrakali Ammavari temple

Leave A Reply

Your email address will not be published.