26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పని చేపించింది ఒకరు సన్మానాలు ఒకరికి

Must read

📰 Generate e-Paper Clip

రాజంపేట, బతుకమ్మ : అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు మాజీ ఎమ్మెల్యే యవ్వారం ఉందని పని చేపించింది ఒకరు సన్మానాలు ఒకరు పొందారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే రాజంపేట మండలం పర్యటనలో సోమారం బస్వన్నపల్లి రోడ్డు ని తాను వేయించానని చెప్పుకోవడం చాలా హాస్య స్పదంగా ఉందన్నారు. ఆయన వేయిస్తే మరి పోయిన ప్రభుత్వం లోనే పనులు పూర్తి కావాలి కదా అని ప్రశ్నించారు. గతంలో కాంట్రాక్టర్, మాజీ ఎమ్మెల్యే రి కమిషన్ లకు తట్టుకోలేక పనులు చేయను అని అగ్రిమెంట్ కాన్సల్ చేసుకునివెళ్ళిపోతే, ఎల్లారెడ్డి మదన్ కాంట్రాక్టర్ ని ఒప్పించి బిల్లు లు రాకుంటే తన సొంత నిధులు అయినా ఇస్తా అని కాంట్రాక్టర్ కు భరోసా నిచ్చి, గెలిచినా అనతి కాలంలోనే కాంట్రాక్టర్ వెంట పడి పనులు పూర్తి చేయించారని తెలిపారు. ఈ విషయాలు తెలియని కొందరు బిఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. నిజా నిజాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. రాజంపేట మండలం లోనే అత్యధికంగా బస్వన్నపల్లి గ్రామానికి ప్రాధాన్యత నిస్తూ ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్ని విధాలుగా నిధులు ఇస్తున్నారని తెలిపారు. గెలిచిన సంవత్సరం లోనే కేవలం బస్వన్న పల్లి గ్రామంలో 50 లక్షల సీసీ రోడ్డు పనులు పూర్తి చేశామని, గల్లీ లో వెళ్లి చుస్తే తెలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర ప్రణీత్ రెడ్డి,మండల సీనియర్ నాయకులు, సంతోష్ రెడ్డి, సంజీవ రెడ్డి, సహాదేవ్, సభకర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, యూత్ అధ్యక్షులు నరేష్, సీనియర్ నాయకులు, శశికాంత్ రెడ్డి,శంకర్, సంతోష్, లింగం,శామయ్య మరియు నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article