- కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి
- మాజీ కార్పొరేటర్ డిమాండ్
ఇందూర్, బతుకమ్మ: కలెక్టరేట్ సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా దారుల నుంచి విడిపించాలని మాజీ కౌన్సిలర్ హజీరా బేగం కలెక్టర్ ను కోరారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంతంలో గల న్యాక్ బిల్డింగ్ పక్కన నాలుగువేల గజాల ప్రభుత్వ స్థలాన్ని కొందరు భూకబ్జాదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు స్థలాన్ని కబ్జా చేసారని బుధవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు మాజీ కౌన్సిలర్ హజీరా బేగం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి దగ్గర్లో ఉన్న న్యాక్ బిల్డింగ్ పక్కన ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొందరు కబ్జాదారులు కబ్జా చేసారని తెలిపారు. ఆ స్థలానికి ప్రహరిని నిర్మించారని చెప్పారు. స్థలం ఓచోట ఉంటే మరో సర్వే నంబర్ తో స్థలాన్ని కబ్జా చేశారన్నారు. దీనిని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పూర్తిగా విచారణ చేపట్టి ఆ స్థలాన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించుకోవాలని ఆమె కోరారు.
