29 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ ప్రజల కోసం ఏర్పడిన పార్టీ బీఆర్ఎస్

Must read

📰 Generate e-Paper Clip

. రానే రాదనుకున్న తెలంగాణను కేసీఆర్ తీసుకొచ్చారు
. దేశంలోనే రాష్ర్టాన్నిమొదటిస్థానంలో నిలిపారు
. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
కామారెడ్డి, బతుకమ్మ: తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ ఆవిర్భవించిందని, రానేరాదనుకున్న తెలంగాణను కేసీఆఱ్ తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఈనెల 27న చలో వరంగల్ సభకు కామారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. తన పదేళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణను దేశంలోనే మొదటిస్థానంలో నిలిపారన్నారు. రాష్ర్టాన్ని నడిపించలేని అసమర్థ నాయకుడు రేవంత్ రెడ్డి అని, భూములు అమ్ముకుని డబ్బులు సంపాదించుకునే పనిలో ఉన్న ఆయన రాష్ట్రానికి  చేసిందేమీ లేదని విమర్శించారు.

రాష్ట్రాన్ని  ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు దీటైన సమాధానం చెప్పేందుకే వరంగల్ సభ నిర్వహిస్తున్నామన్నారు. సభకు బయల్దేరే ముందు గ్రామాల్లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని సూచించారు.

More articles

Latest article