నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఎస్ యూఐ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ అండ్ సైన్స్. కళాశాల ముందు యూనివర్సిటీ ఎన్ఎస్ యూఐ అధ్యక్షులు సాగర్ నాయక్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్ కుమార్ హాజరై మాట్లాడారు. విశ్వవిద్యాలయంలో విద్యా రంగ సమస్యల పరిష్కారానికి ఎన్ఎస్ యూఐ విద్యార్థి సంఘం ముందు ఉంటుందన్నారు. యూనివర్సిటీ ఎన్ఎస్ యూఐ అధ్యక్షులు సాగర్ నాయక్ మాట్లాడుతూ యూనివర్సిటీ సమగ్ర అభివృద్ధికి దోహదపడే విధంగా మా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మణ్ చక్రవర్తి, ప్రొఫెసర్ కనకయ్య, ప్రొఫెసర్ పున్నయ్య, ప్రొఫెసర్ సంపత్, ప్రొఫెసర్ మహేందర్, యూనివర్సిటీ ఎన్ఎస్ యూఐ వైస్ ప్రెసిడెంట్ మహేష్,శివ ప్రసాద్, ఎన్ఎస్ యూఐ జనరల్ సెక్రటరీ నవీన్,జనార్ధన్ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.
