బతుకమ్మ భిక్కనూరు: తప్పులు లేకుండా రేషన్ కార్డు సర్వే చేయాలని ఎంఆర్ఓ శివప్రసాద్ తెలిపారు. మండలంలోని 18 గ్రామ పంచాయతీలలో కార్యదర్శుల చేత రేషన్ కార్డు సర్వే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. రేషన్ కార్డుల సర్వే కార్యక్రమాన్ని డి ఎల్ పి ఓ, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, తాసిల్దార్ శివప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమంలో రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ప్రకారం గ్రామాలలో మొబైల్ యాప్ ద్వారా సర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయడం, రేషన్ కార్డ్ సపరేట్ చేయడం వంటి వివరాలు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామస్తులు సర్వే నిర్వహిస్తున్న కార్యదర్శులకు పూర్తి వివరాలు దయచేసి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు.
