27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

వ్యవసాయదారులు సేంద్రియ పద్ధతిలో సాగు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల : రైతులు సేంద్రియ పద్ధతిలోనే పంట సాగు చేయాలని విశ్వ ఆగ్రో టెక్ పద్ధతిలో సుభాష్ సూచించారు. తొర్తి, బట్టపూర్, గ్రామాల్లో గ్రామపంచాయతీ కార్యాలయంలో రైతులకు మహిళ రైతులకు మహిళా సంఘాల ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ మాట్లాడుతూ రైతులు రసాయనిక ఎరువులకు దూరంగా ఉండాలని, సేంద్రీయ పద్ధతిలో పంటలు పండించి ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించాలని సూచించారు. రైతులు భూసార పరీక్షలు చేయించుకొని ఏ పంట వేస్తే బాగుంటుందో తెలుసుకోవాలని సూచించారు. ఎరువుల వాడకం పంటల దిగుమతుల గురించి ప్రొజెక్టర్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం శ్యామ్,సీసీలు నవీన్ సంతోష్,బట్టాపూర్ పంచాయతీ కార్యదర్శి రవి, వి ఓఏలు,రశ్మిత లావణ్య గ్రామ సంఘాల అధ్యక్షులు మహిళలు పాల్గొన్నారు.

More articles

Latest article