వ్యవసాయదారులు సేంద్రియ పద్ధతిలో సాగు చేయాలి

బతుకమ్మ,ఏర్గట్ల : రైతులు సేంద్రియ పద్ధతిలోనే పంట సాగు చేయాలని విశ్వ ఆగ్రో టెక్ పద్ధతిలో సుభాష్ సూచించారు. తొర్తి, బట్టపూర్, గ్రామాల్లో గ్రామపంచాయతీ కార్యాలయంలో రైతులకు మహిళ రైతులకు మహిళా సంఘాల ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ మాట్లాడుతూ రైతులు రసాయనిక ఎరువులకు దూరంగా ఉండాలని, సేంద్రీయ పద్ధతిలో పంటలు పండించి ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించాలని సూచించారు. రైతులు భూసార పరీక్షలు చేయించుకొని ఏ పంట వేస్తే బాగుంటుందో తెలుసుకోవాలని సూచించారు. ఎరువుల వాడకం పంటల దిగుమతుల గురించి ప్రొజెక్టర్...