23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

రైస్ మిల్లుల యజమానులపై క్రిమనల్ చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

కోటగిరి, బతుకమ్మ: బోనస్ కాజేసిన బోగస్ రైతులపై, వారికి సహకరించిన సంఘం చైర్మన్రైస్ మిల్లుల యజమానుల పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. బుధువారం సీపీఐ ఆధ్వర్యంలో సహకార సంఘం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి దుబాస్ రాములు మాట్లాడుతూ.. కోటగిరి సొసైటీ కి గత ఖరీఫ్ లో ధాన్యం విక్రయించిన రైతుల జాబితాను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

బోగస్ రైతుల పేర్లతో సుమారు రూ.50లక్షల రూపాయల అవినీతి జరిగిందని, దీనిపై పూర్తిస్థాయిలో విజిలెన్స్ అధికారులతో విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన కోటగిరి సొసైటీ చైర్మన్, కార్యదర్శిని సస్పెండ్ చేయాలని, అదేవిధంగా అవినీతికి పాల్పడిన లక్ష్మణ్, శ్రీనివాస్, శ్రీహరి, ఇస్మాయిల్ వద్ద నుంచి డబ్బులు రికవరీ చేసి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

కోటగిరి సొసైటీ నుంచి శ్రీ సాయి ఆగ్రో ఇండస్ట్రీస్, ఓం సాయి ట్రేడర్స్, ఎస్ ఏ ట్రేడర్స్, జీ ఎం కేతోపాటు ఇతర రైస్ మిల్లులకు ఏ ట్రక్ షీట్ ద్వారా ఎంత మంది రైతుల పేర్లతో ఎన్ని క్వింటాళ్ల ధాన్యాన్ని పంపించారనే వివరాలను బహిర్గతం చేయాలని అన్నారు. కోటగిరి మండల సీపీఐ కార్యదర్శి ఏ విఠల్ గౌడ్ మాట్లాడుతూ.. చాలామంది రైతులు ప్రైవేట్ వ్యాపారులకు, రైస్ మిల్లులకు ధాన్యాన్ని రూ.2060కి విక్రయించారని, దీనిని ఆసరా చేసుకుని సొసైటీ చైర్మన్, ఆయన అనుచరులు రైస్ మిల్ యజమానులతో మిలాఖత్ అయి బోనస్ డబ్బులు రూ.500 మద్దతు ధరలో రూ.300 ఇలా క్వింటాల్ కు మొత్తం రూ.800 స్కామ్ చేశారనిపైగా, పైగా సీఎంఆర్ పేరుతో ఈ వడ్లనురైస్ మిల్లులకు కట్టబెట్టారని ఆరోపించారు.

ఇంత జరిగినా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మోసానికి పాల్పడిన వ్యక్తులను కాపాడుతున్నారని విమర్శించారు. ధర్నా లో సీపీఐ నాయకులు నల్ల గంగాధర్, బు డాల రాములు, కోటగిరి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆనంద్, మాజీ ఎంపీటీసీ సలీం, కూచి సాయిబాబు, నజీర్, నల్ల నరసయ్య, బూడాల శివరాజు, హనుమాన్లు, సోహెల్, వాజిద్, పాకాల సాయిలు, ఆకుల లక్ష్మణ్, ఎర్ర సాయిలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article