25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

బతుకమ్మ ఎఫెక్ట్

Must read

📰 Generate e-Paper Clip

  • నాలేశ్వర్ ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
  • ట్రాన్స్ఫార్మర్స్ దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక టీం ల ఏర్పాటు
  •  నార్త్ రూరల్ సి.ఐ. సతీష్

బతుకమ్మ, నవీపేట్ : మండలం లో వరుసగా ట్రాన్స్ ఫార్మన్లను ధ్వంసం చేస్తున్న దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసినట్లు నార్త్ రూరల్ సి.ఐ. సతీష్ తెలిపారు. ట్రాన్స్ఫార్మర్స్ ధ్వంసం జరిగిన ఘటనస్థలాన్ని నవీపేట్ ఎస్సై వినయ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సి.ఐ. మాట్లాడుతూ వరుసగా ట్రాన్స్ ఫార్మర్స్ లను ఒక్కటే గ్యాంగ్ ధ్వంసం చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశామని తెలిపారు.త్వరలోనే దుండగులను పట్టుకుంటామనిఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామాల్లో కానీ, శివారు ప్రాంతాల్లో గుర్తుతెలియని ఆటో, కారు లో అనుమానాదాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రైతులను సి.ఐ. సతీష్ కోరారు.

More articles

Latest article