24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆయుష్ ఆధ్వర్యంలో వృద్ధాప్య వైద్య శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ కోటగిరి : తెలంగాణ డిపార్ట్మెంట్ అఫ్ ఆయుష్ ఆదేశాల మేరకు పోతంగల్ మండల కేంద్రంలోని ఆయుష్ వైద్యశాలలో ఏర్పాటు వృద్ధాప్య వైద్య శిబిరాన్ని ఆయుష్ విభాగం జిల్లా ఇన్చార్జ్ డాక్టర్ నారాయణ రావు ముఖ్యఅతిథిగా పాలొ్గని గురువారం ప్రారంభించారు.ఈ సందర్బంగా డాక్టర్ నారాయణ్ రావు మాట్లాడుతూ వృద్ధాప్య వైద్య శిబిరన్ని ప్రజలు అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ శిబిరంలో దీర్ఘ కాలిక వ్యాదులు,చర్మ వ్యాదులు, కీళ్ల నొప్పులు అర్శమొలలు,స్త్రీ వ్యాదులు, జ్వర వ్యాదులు, మల బద్ధకం, బీపీ,షుగర్,అన్ని రకాల వ్యాధులకు చికిత్స లు నిర్వహించి ఉచితముగా ఔషధము లు అందరికీ పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలోమండల ఆయుష్ వైద్యరాలు డాక్టర్ ఆకుల రాధికా కళ్యాణ పాడ్,డాక్టర్ వెంకటేష్, పి హెచ్ సి, డాక్టర్ కరణ్,డాక్టర్ శ్రావ్య, ఆయుష్ విభాగం ఫార్మాసిస్ట్ లు పురుషోత్తం,నిరత,జాబీనా,సాఫియా సూపర్వైజర్ లు సుజాత,సావిత్రి,లు ఆశ కార్య కర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Geriatric Medical Camp under AYUSH

 

More articles

Latest article