27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

29 స్టేజీలు, 70 కిలో మీటర్లు, 3 జిల్లాలు..

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మోర్తాడ్:  మేట్ పల్లీ నుండి నిర్మల్ వరకు వయా డొంకల్, ధర్మోరా, శెట్పల్లి, సావెల్ ,మెండోరా గ్రామాల మీదుగా బస్సును నడిపించమని మెట్ పల్లీ డిపో మేనేజర్ టి. దేవరాజును ప్రయాణికులు కోరారు. దీంతో స్పందించిన మెట్ పల్లీ డిపో మేనేజర్ టి. దేవరాజు గురువారం మెట్ పల్లీ నుంచి నిర్మల్ వరకు బస్సు ప్రయాణించే మార్గమును పరిశీలించారు. డిపో మేనేజర్ మాట్లాడుతూ మెట్ పల్లీ నుంచి నిర్మల్ వరకు 29 స్టేజిలు, 70 కిలో మీటర్లు, 3 జిల్లాల మీదుగా బస్సు ప్రయానిస్తుందని పేర్కొన్నారు. నిర్మల్ డిపో మేనేజర్ ప్రతిమకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో శేట్ పల్లీ గురజాల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article