నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గురువారం 8 మంది ప్రొబేషనరీ ఎస్ఐ.పీలు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా కలిసి పువ్వుల మొక్కను అందజేశారు. సీపీని కలిసిన వారిలో నాలుగో టౌన్ సుస్మిత, నందిపేట్ పీఎస్ సుహాసిని, బోధన్ టౌన్ పీఎస్ కళ్యాణి, బోధన్ రూరల్ పీఎస్ రమ, వన్ టౌన్ పీఎస్ రాజేశ్వర్, ఆర్మూర్ పీఎస్ కిరణ్ పాల్, భీంగల్ పీఎస్ శైలేందర్, ఆరో టౌన్ పీఎస్ శ్రీనివాస్ ఉన్నారు.
