నిజామాబాద్ రూరల్, బతుకమ్మ: తెలంగాణ యూనివర్సిటీలో హిందీ విభాగం చైర్మన్ బి ఓ ఎస్ గా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా” ఎం డి జమీల్ అహ్మద్ కి బెంగళూరుకు చెందిన ఇంటర్నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అనే సంస్థ బోధన, పరిశోధన రంగంలో కృషి చేస్తున్న డాక్టర్ మొహమ్మద్ జమీల్ అహ్మద్ కు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ ప్రకటించింది. డాక్టర్ మహ్మద్ జమీల్ అహ్మద్ గత 30 సంవత్సరాలుగా బోధనలో సేవలు అందిస్తున్నారు. గతంలో డాక్టర్ జమీల్ అహ్మద్ కాకతీయ విశ్వవిద్యాలయంలో 15 సంవత్సరాలుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, తెలంగాణలో విశ్వవిద్యాలయంలో గత 11 సంవత్సరాలుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సేవలు అందిస్తున్నారు. డాక్టర్ జమీల్ కు చెందిన 60కి పైగా పరిశోధన పత్రాలు హిందీ భాషకు చెందిన ప్రముఖ పత్రికలలో ప్రచురించాయి. మూడు పుస్తకాలు, 30కి పైగా పరిశోధన పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ జమీల్ అహ్మద్ తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఎం యాదగిరి అభినందించారు. ఈ సందర్భంగా టూటా అధ్యక్షులు డాక్టర్ పున్నయ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ ఖవి, డాక్టర్ ఖురేషి, డాక్టర్ పార్వతి, డాక్టర్ గుల్ హి రాణా, తదితరులు అభినందించారు.
డా.ఎం.డి జమీల్ అహ్మద్ కు డా.ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు
