నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీ లో బీసీ కులగణన బిల్లును ఆమోదం తెలిపి బీసీ రిజర్వేషన్ 42 శాతానికి పెంచిన సందర్భంగా కాంగ్రెస్ భవన్ వద్ద జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన సందర్భంలో బీసీ కుల గణన చేసి బీసీ లకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తామని మాట ఇచ్చరని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కులగణన నిర్వహించి బీసీ లకు రిజర్వేషన్ పెంచారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో నే బీసీ లకు న్యాయం జరిగిందని,కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ ల పక్షపాతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్,మాజీ ఎంఎల్సి ఆకుల లలిత, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్,జిల్లా ఫిషెర్మాన్ చైర్మన్ శ్రీనివాస్, డీసీసీ డెలిగేట్ ప్రమోద్,నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, బింగి మధు సుధాన్,మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష,గాజుల సుజాత,అపర్ణ,నరేందర్ గౌడ్, ఎన్ఎస్యూఐ నాయకులు చింటూ, ఆడే ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
