29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

తేయూకి ఈశ్వరి బాయి పేరుపెట్టాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  తెలంగాణ  యూనివర్సిటీకి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరుగని పోరు చేసిన ఈశ్వరి బాయి పేరు పెట్టాలని నిజామాబాద్ జిల్లా దళిత ప్రజా సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు టీమ్ కన్వీనర్ సక్కి ఉదయ్,దేవిదాస్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చిట్టేటి మోహన్ రావు,జనరల్ సెక్రెటరీ నాంది వినయ్ , భీమ్ ఆర్మీ జిల్లా జనరల్ సెక్రెటరీ బత్తుల కిష్టయ్య,డిక్కీ జిల్లా అధ్యక్షులు సిహెచ్ వెంకటరమణ, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షులు అబ్బి ప్రగతి,ఆల్ మాలా స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అంగరి ప్రదీప్, ఉపాధ్యక్షులు తర్ల లక్ష్మణ్ మాట్లాడుతూ తొలి దశ తెలంగాణ పోరాటంలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను ప్రజాక్షేత్రంలో నిలిపిన తెలంగాణ పోరు వనిత ఈశ్వరి బాయి  అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి అందించిన సేవలకు గుర్తుగా తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఆమె పేరును ప్రతిపాదించిన సీఎం రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయాన్ని కొందరు దళిత వ్యతిరేకులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దళిత అణగారిన కులాల అభ్యున్నతే లక్ష్యంగా జీవితాంతం కృషిచేసిన ఈశ్వరీబాయి గారి పేరును తెలంగాణ విశ్వవిద్యాలయానికి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆమె తెలంగాణ రాష్ట్రానికి అందించిన సేవలకు తగిన గుర్తింపును ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ దళిత నాయకులు షేట్పల్లి నారాయణ, రాజేందర్, రఘు, ప్రభాస్, రవి, మురళి, వేణు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article