27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

జిల్లాలో పసుపు బోర్డు ఎక్కడుందో నాకు తెలియదు

Must read

📰 Generate e-Paper Clip

. . . ఎంపీ అరవింద్ వల్ల నవోదయ ఏర్పాటుకు అడ్డంకులు

. . . నిజామాబాద్ ఎం ఏసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

కేంద్ర ప్రభుత్వం పసుపు రైతుల సంక్షేమం కోసం జిల్లాలో ఏర్పాటు చేశామని చెబుతున్న పసుపు బోర్డు ఎక్కడ ఉంది  నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన తనకు తెలియదని ఇంకా రైతులకు ఎలా తెలుస్తుందని ముప్ప గంగారెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం విలేఖరులతో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ…. బిజెపి ప్రభుత్వం రైతులను పసుపు బోర్డు పేరిట మోసం చేసిందన్నారు. ఒకసారి స్పైస్ బోర్డు ఇప్పుడు పసుపు బోర్డు అని వంచించందన్నారు. జిల్లాలో పసుపు బోర్డు అని ప్రైవేట్ హోటల్ లో దానిని ప్రారంభించారని అందుకు రైతులను, మార్కెట్ కమిటీలను పిలువకుండా కేవలం పార్టీ కార్యకర్తల చే చేయించారన్నారు. ఎంపీ అరవింద్ పసుపు బోర్డు ఏర్పడిందని ఇక పసుపును క్వింటాల్ కు రూ.15 వేల నుంచి 25 వేలకు కొనుగోలు జరుగుతుందని హామీ ఇచ్చారు దాన్ని అమలు చేయాలన్నారు. ఇప్పటి వరకు పసుపు బోర్డు విధివిధానాలు ఖరారు కాలేదని, పాలకవర్గం, అధికారుల నియామకం జరగలేదు ఒక్క రూపాయి బడ్జెట్ లో కేటాయించలేదన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నవోదయ విద్యాలయాన్ని రూరల్ నియోజకవర్గంలో సకల సౌకర్యాలు ఉన్న జక్రాన్ పల్లి ప్రతిపాదన చేస్తే జాతీయ రహదారికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న  కలిగోటను ఎంపి అరవింద్ ప్రతిపాదించడం కారణంగా అది ఏర్పాటు కాకుండా తిరస్కరణకు గురైందని ముప్ప గంగారెడ్డి ఆరోపించారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పై బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కుల చారి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే భూపతిరెడ్డి ని దూషిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బిజేపి నాయకులకు ఎమ్మెల్యే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని దానికి పార్టీ కార్యకర్తల మైన తామే సరిపోతామని ముప్ప గంగారెడ్డి అన్నారు.

 

 

More articles

Latest article