27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అధికారులే అమ్మానాన్నయ్యారు..

Must read

📰 Generate e-Paper Clip

  • అంగరంగ వైభవంగా అనాథ యువతి వివాహం
  • కరీంనగర్ కళాభారతిలో పెళ్లి జరిపించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
  • అతిథులుగా జిల్లా అధికారులు..

కరీంనగర్, బతుకమ్మ : బాజా భజంత్రీలు.. మేళ తాళాలు ఒకవైపు.. పెద్ద ఎత్తున అతిథులు.. వేద పండితుల మంత్రోచ్ఛారణాలు మరోవైపు.. కోలాహలం.  సందడే సందడి.. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం సాయం అందించిన సందర్భం అది. అదొక వైభవోపేతంగా జరిగిన ఘట్టం.. సాంప్రదాయ బద్ధంగా నిర్వహించిన వివాహ వేడుక.. ఈ వేడుకకు కరీంనగర్ లోని కళాభారతి ఆడిటోరియం వేదిక అయింది. ఈ పెండ్లికి పెద్దలుగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వ్యవహరించారు. ఈ వివాహ వేడుకకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల సధనంలో పెరిగిన ఓ అనాథ యువతికి ఆదివారం కరీంనగర్ కళాభారతిలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. ఆ యువతికి తల్లిదండ్రులు లేరు. అనాథ అయినా ఎలాంటి లోటు రాకుండా అధికారులే అమ్మానాన్న అయ్యారు. తల్లిదండ్రుల బాధ్యతలు నిర్వర్తించారు జిల్లా కలెక్టర్. ఆమెకు కలెక్టర్, ఎమ్మెల్యే సత్యనారాయణ, అధికారులందరూ పెద్దదిక్కుగా నిలిచారు. ఏ యువతికి కూడా జరగని విధంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించి కరీంనగర్ జిల్లాలోనే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అనాథలకు మేము తోడుగా నిలుస్తామనే భరోసాను కల్పించారు. అనాథలు ఎవరు కూడా ఎవరూ లేరనే బాధ పెట్టుకోవద్దని నిరూపించారు.

The authorities themselves became the parents.

వివరాల్లోకి వెళితే తల్లిదండ్రులు లేకపోవడంతో 2017లో పూజ (మౌనిక)ను కరీంనగర్ బాలసదనంలో చేర్పించారు. అక్కడ అధికారులు ఆమెకు చదువు చెప్పించడంతోపాటు ఆలనాపాలన చూశారు. ఇంటర్ తర్వాత ఎంపీహెచ్ డబ్ల్యూ కోర్సు చేసి ఇంటర్నిషిప్ చేస్తుండగా పెద్దపెల్లి జిల్లా మంథనికి చెందిన సాయి తేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.  ఈ విషయం యువతి అధికారులకు చెప్పడంతో .. యువకుడితో  మాట్లాడగా పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కుటుంబసభ్యులు అంగీకరించడంతో మహిళ, శిశు సంక్షేమశాఖ అధికారులు పెళ్లి నిశ్చయించారు.అధికారులే పెళ్లి పెద్దలుగా మారి అన్ని పనులు చేశారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పెళ్లికి వచ్చే అతిథులకు భోజనం ఏర్పాటు చేసి పెద్ద మనసు చాటుకున్నారు. కలెక్టర్ పమేలా సత్పతి దంపతులను ఆశీర్వదించి.. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని తాను స్వయంగా రాసిన లెటర్ ను వధూవరులకు అందించారు. అదేవిధంగా మౌనిక వివాహానికి జిల్లా కలెక్టర్, జిల్లా జడ్జి, జిల్లా యంత్రాంగం, మహిళా సంక్షేమ శాఖ అధికారులు, ఎన్జీవో నాయకులు వివిధ శాఖల అధికారులు అందరూ సహాయం అందించారు. అందరూ కలిసి మౌనిక వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. కరీంనగర్ జిల్లాలోనే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.  అనాథలకు మేమున్నామనే భరోసా కల్పించారు అధికారులు.

The authorities themselves became the parents.

  • మౌనికకు వివాహం చేయడం చాలా ఆనందంగా ఉంది..
  • ఎల్లవేళలా అండగా ఉంటాం..
  • జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

అనాథ యువతి మౌనికకు జిల్లా యంత్రాంగం తరఫున తన ఆధ్వర్యంలో వివాహం జరిపించడం చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. మౌనికకు ముగ్గురు చెల్లెలు ఉన్నారని, వాళ్లకు అమ్మ నాన్న లేరని కలెక్టర్ తెలిపారు. మౌనిక నర్సింగ్ వరకు చదివి ప్రయోజకురాలుగా మారిందని, ఆమెను మరింత ఉన్నత చదువులు చదివించాలని సాయి తేజ, వారి కుటుంబ సభ్యులకు రిక్వెస్ట్ చేశామని తెలిపారు. మౌనిక చెల్లెలు కూడా బాగా చదివించాలని కోరామని పేర్కొన్నారు. వారు కూడా తమ రిక్వెస్ట్ కు సానుకూలంగా స్పందించారని తెలిపారు. మౌనిక చెల్లెలను బాగా చదివించాలని మౌనికకు సాయి తేజకు చెప్పామని పేర్కొన్నారు. వివాహ వేడుకకు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సైతం పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందించారని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం తరఫున అధికారులు టిఎన్జీవోలు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సాయం అందించారని పేర్కొన్నారు. అనాథలు ఎవరూ బాధపడవద్దని వారికి అండగా ప్రభుత్వం ఉంటుందని, ఆపదలో ఉన్న మనిషికి మనిషిగా ప్రేమతో  సహాయం చేయడం గొప్పతనం అన్నారు. మౌనిక కుటుంబానికి సైతం నిరంతరం ఉండగా ఉంటామని, అనాధలకు దారి చూపిస్తామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు.

The authorities themselves became the parents.

  • అనాథలకు పెద్దన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
  • నిరంతరం తోడుగా ఉంటుంది సర్కార్..
  • మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

అనాతలకు పెద్దన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, అనాధలు ఎవరు లేరని బెంగ పెట్టుకోవద్దని, ప్రభుత్వం నిరంతరం తోడుగా ఉంటుందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక అనాథ యువతికి వివాహం ప్రభుత్వా నిధులు, దాతల సహకారంతో జరిపించడం అభినందనీయమని తెలిపారు. జిల్లా కలెక్టర్ అనాధలకు  అండగా నిలుస్తాననే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్నారని చెప్పారు. అనాథలు ఎవరు ఎలాంటి బెంగ పెట్టుకోవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా తోడుగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళల సంక్షేమ ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. నిన్ననే మహిళా దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి మహిళల సంక్షేమానికి అనేక ప్రణాళికలు పాలసీల రూపొందించాలని ఎమ్మెల్యే గుర్తు చేశారు.

  • సహకరించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు..
  • జిల్లా సంక్షేమ అధికారి సబిత..

ఏ ఆడపిల్లకు జరగని విధంగా మౌనిక వివాహం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిందని జిల్లా సంక్షేమ అధికారి సబిత పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ దగ్గరుండి తల్లితండ్రుల బాధ్యతను నెరవేర్చరని తెలిపారు. వివాహ వేడుకకు జిల్లా కలెక్టర్, జిల్లా జడ్జి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది, టీఎన్జీవో ప్రతినిధులు, గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్, డాక్టర్లు వివిధ శాఖల అధికారులు, అనేకమంది ఆర్థిక సాయం అందించారని పేర్కొన్నారు. అందరికీ జరిపించినట్లు సంప్రదాయపద్ధంగా హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్, కళ్యాణము అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. మౌనికకు తల్లిదండ్రులు అందించిన విధంగానే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అందరం కలిసి వస్తువులు అందించామని చెప్పారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కళ్యాణానికి వచ్చిన అతిథులకు భోజన ఏర్పాట్లు చేశారని  తెలిపారు. తమ శాఖ ఆధ్వర్యంలో మౌనిక వివాహం జరిపించడం ఆనందంగా ఉందని జిల్లా సంక్షేమ అధికారి సబిత పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సబిత, డీసీపీఓ పర్వీన్, స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు శోభారాణి, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ స్వరూపారాణి, సిడిపివోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

The authorities themselves became the parents.

More articles

Latest article