అధికారులే అమ్మానాన్నయ్యారు..

అంగరంగ వైభవంగా అనాథ యువతి వివాహం కరీంనగర్ కళాభారతిలో పెళ్లి జరిపించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అతిథులుగా జిల్లా అధికారులు.. కరీంనగర్, బతుకమ్మ : బాజా భజంత్రీలు.. మేళ తాళాలు ఒకవైపు.. పెద్ద ఎత్తున అతిథులు.. వేద పండితుల మంత్రోచ్ఛారణాలు మరోవైపు.. కోలాహలం.  సందడే సందడి.. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం సాయం అందించిన సందర్భం అది. అదొక వైభవోపేతంగా జరిగిన ఘట్టం.. సాంప్రదాయ బద్ధంగా నిర్వహించిన వివాహ వేడుక.. ఈ...