- మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్. రమేష్
సిరికొండ, బతుకమ్మ : అజ్ఞాత శూరుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవన్న స్ఫూర్తినీ కొనసాగిద్దమని, బలమైన విప్లవొద్యమాలను నిర్మించి, కామ్రేడ్.రవన్న ఆశయాలను పరిపూర్తి చేద్దామని సీపీఐ(ఎం. ఎల్.) మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా నాయకులు ఆర్. రమేష్ అన్నారు. మండలంలోని గడ్కోల్ గ్రామంలో కామ్రేడ్. రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న)తొమ్మిదో వర్ధంతి సభ ను ఘనంగా నిర్వహించారు. అమరుడు కామ్రేడ్. రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న) చిత్రపటానికి పూల మాల వేసి, రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. తదనంతరం సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ గ్రామ కార్యదర్శిమల్కి. లింబాద్రి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ 1969 లో డిగ్రీ చదువు ను వదిలి రాయల సుభాష్ చంద్రబోస్ ఎస్. ఎఫ్ లో కామ్రేడ్ బత్తుల వెంకటేశ్వరరావు తో పనిచేస్తూ ఆ తర్వాత 1970… 72 ప్రాంతం నాటికి రాష్ట్ర జీవితంలోకి వెళ్ళాడు.50 సంవత్సరాలు పాటు రాష్ట్ర జీవితం గడుపుతూనే 2016 మార్చి 9న బ్రెయిన్ స్ట్రోక్ గురై అమరులయ్యారు. పార్టీలో 1980 నుంచి కామ్రేడ్ డీవీకే. వి.వి. రవన్నలు కలిసి అతివాద, అవకాశవాద, అందాక వ్యతిరేకంగా అంతర్గత పోరాటం చేశారన్నారు . సరైన ప్రజా పందా కోసం. విప్లవ ఉద్యమాన్ని సరైన దిశలో నడిపేందుకు అవసరమైన వ్యూహం,ఎత్తుగళ్ల కోసం కూడా అంతర్గత పోరాటం నడిపింఛరన్నారు .ఈ అంతర్గత పోరాటంలో కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ దృఢంగా నిలబడి,1984 సిపి రెడ్డి నిందించి,వేధించిన తాము విశ్వసించిన ప్రజా పందాలు అమలుచేసి చీలికను సైతం ఎదుర్కొని ఉద్యమాన్ని నిలబెట్టారన్నారు.ఆంధ్ర రాష్ట్రంలో మెజార్టీ ఉద్యమాన్ని తమ వెనుక నిలబెట్టుకోవడమే కాకుండా,ఆ ఉద్యమాన్ని సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలో ప్రజాపంథాకు రాజకీయ సైదాంతిక నిర్మాణం గుర్తింపును తెచ్చారని తెలిపారు.కామ్రేడ్ రవన్న నిబద్ధత,నిర్మాణ దక్షత,అంకితభావం గల నమ్మిన రాజకీయ సైతాంతిక విశ్వాసాలను అమలు చేసే గొప్ప విప్లవకారుడని ఆయన అభివర్ణించాడు.ప్రజా పందా రాజకీయాల మార్గదర్శకులలో ఒకడని,ఆయన మారిన సమాజ స్థితిని అర్థం చేసుకొని బోధించిన వాడని,ఆ వెలుగులోనే ఈరోజు సిపిఎంఎల్ మాస్ లైన్ నడుస్తుందని అన్నారు.ఆయన ఆశయాలు ముందు ముందుకు తీసుకుపోవడానికి మనమంతా కృషి చేయాలని అదే ఆయనకి ఇచ్చేటువంటి నిజమైన నివాళి అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా)మండల నాయకులు పి. రమ, మల్కి,లింబాద్రి, ఇ. రమేష్, ఎం. నారగౌడ్, జీ. బాల్ రెడ్డి, జీ ఎర్రన్న,కట్ట. రాములు,బి. ఒడ్డెన్న తదితరులు పాల్గొన్నారు.
