29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

పల్లె దవఖానాల్లో రోగులకు సరైన సేవలు అందించాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నాగిరెడ్డిపేట : గ్రామాలు పల్లెల్లో ఏర్పాటు చేసిన పల్లె దవఖానాల ద్వారా గ్రామీణ ప్రాంత రోగులకు సరైన సేవలు అందించాలని రాష్ట్ర క్వాలిటీ ప్రోగ్రాం అధికారిని రాధిక అన్నారు. శుక్రవారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆత్మకూరు  పల్లె దవాఖానా ను జాతీయ క్వాలిటీ టీమ్ సభ్యులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర క్వాలిటి ప్రోగ్రాం అధికారిని రాధిక మాట్లాడుతూ పల్లె దవాఖానా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పల్లె దవఖానాలో రోగులకు కావలసిన మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని, దవఖానకు వచ్చే రోగుల వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ పద్మజ, క్వాలిటీ మేనేజర్ జహీర, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ సృజన్ కుమార్, ఆరోగ్య కార్యకర్తలు, మేల్ వర్కర్ మురళి, ఆశ వర్కర్లు తదితరులు ఉన్నారు.

More articles

Latest article