పల్లె దవఖానాల్లో రోగులకు సరైన సేవలు అందించాలి
బతుకమ్మ, నాగిరెడ్డిపేట : గ్రామాలు పల్లెల్లో ఏర్పాటు చేసిన పల్లె దవఖానాల ద్వారా గ్రామీణ ప్రాంత రోగులకు సరైన సేవలు అందించాలని రాష్ట్ర క్వాలిటీ ప్రోగ్రాం అధికారిని రాధిక అన్నారు. శుక్రవారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆత్మకూరు పల్లె దవాఖానా ను జాతీయ క్వాలిటీ టీమ్ సభ్యులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర క్వాలిటి ప్రోగ్రాం అధికారిని రాధిక మాట్లాడుతూ పల్లె దవాఖానా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పల్లె దవఖానాలో రోగులకు కావలసిన మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు...