26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

  • పాల్గొన్న పోచారం కుటుంబ సభ్యులు

 

బాన్సువాడ, బతుకమ్మ  : కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం తిమ్మాపూర్ లోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానములో శుక్రవారం  శ్రీలక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ దేవి,భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవము ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. నిజాంబాద్ జిల్లా  బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహత, పోచారం శంభు రెడ్డి , పోచారం రవీందర్ రెడ్డి ,  పోచారం సురేందర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, స్వామి వారి కళ్యాణానికి ముందుగా నిర్వహించిన హోమంలో సతీసమేతంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, భారీ ఎత్తున భక్తులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.

Sri Venkateswara Swamy Kalyana Mahotsavam in full swing

More articles

Latest article