వెబ్ న్యూస్, బతుకమ్మ : మాజీ మంత్రి రోజాకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆడుదాం ఆంధ్రాపై విచారణకు ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్రా అవకతవకలపై శాసన మండలిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్వతంత్ర విచారణ కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు. 45 రోజుల్లో సభకు నివేదిక అందిస్తామని మంత్రి రాంప్రసాద్ వెల్లడించారు. ఆడుదాం ఆంధ్ర కోసం గత వైసీపీ ప్రభుత్వం రూ. 119 కోట్లు ఖర్చు చేసిందని రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
