ఆసుపత్రికి తరలిస్తుండగా మహిళ మృతి
వెబ్ న్యూస్, బతుకమ్మ : శంషాబాద్ ఎయిర్పోర్టులో దోహా నుంచి బంగ్లాదేశ్ వెళ్తున్న ఖత్తర్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానంలో ఒక మహిళ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మెడికల్ ఎమర్జెన్సీ కోసం పైలట్లు విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఆసుపత్రికి తరలిస్తుండగా సదరు మహిళ మృతి చెందింది.