30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మసిస్టు కొరత

Must read

📰 Generate e-Paper Clip

  • ఫార్మసిస్ట్ లేక సిబ్బంది మందులు పంపిణీ

 

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మసిస్ట్ కొరతతో సిబ్బంది మందులు పంపిణి చేస్తున్నారు. దాదాపు 6 నెలల నుండి ఫార్మసిస్ట్ లేకుండానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందుల పంపిణీ జరుగుతుంది. కేవలం ఫార్మసిస్ట్ మాత్రమే కాకుండా స్టాఫ్ నర్స్ కూడా పోస్టులు ఖాళీ ఉన్నట్లు సమాచారం. ఫార్మసిస్టుతో పాటు స్టాఫ్ నర్స్ కూడా డిప్యూటేషన్ పై విధులు కొనసాగిస్తున్నారు. బోధన్ నుండి ఫార్మసిస్ట్ రుద్రూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వారానికి మూడు రోజులు డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్నారు. రోగులు ఇబ్బంది ఎదుర్కోకముందే ఫార్మసిస్ట్ పోస్టును భర్తీ చేస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు.

More articles

Latest article