28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలుపునకు కావాల్సిన ఓట్లు 11,822

Must read

📰 Generate e-Paper Clip

  • మూడో ఎలిమినేషన్ తర్వాత ఎవరికీ రాని మెజారిటీ

 

నల్గొండ, బతుకమ్మ : నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 24,135.. చెల్లని ఓట్లు 494.. మొత్తం వాలీడ్ ఓట్లు…23,641ఇందులో సగానికంటే ఒక ఓటు ఎక్కువ రావాలి…అనగా 11,822 ఓట్లు. ఎలిమినేషన్ ప్రక్రియ లో 11,822(మొదటి ప్రాధాన్యత కలుపుకొని)ఓట్లు వచ్చేంతవరకు లెక్కిస్తారు. ఈ టార్గెట్ ఎవరు చేరుకుంటే వారే విజేత. మొదటి ప్రాధాన్యతలో శ్రీపాల్ రెడ్డి కి 6035, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4820, హర్షవర్ధన్ రెడ్డి కి 4437 ఓట్లు వచ్చాయి. వివిధ అభ్యర్థులు ఎలిమినేషన్ అవుతున్నప్పుడు రెండవ ప్రాధాన్యత ద్వారా శ్రీపాల్ రెడ్డి కి 5,787 ఓట్లు వస్తే గెలుపొందుతారు. అలుగుబెల్లి నర్సిరెడ్డి కి 7002 ఓట్లు వస్తే గెలుపొందుతారు. హర్షవర్ధన్ రెడ్డికి 7385 ఓట్లు వస్తే గెలుపొందుతారు. 13 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ తర్వాత శ్రీపాల్ రెడ్డికి రెండవ ప్రాధాన్యతలో(6035)+130, అలుగుబెల్లి నర్సిరెడ్డికి రెండో ప్రాధాన్యత ద్వారా (4820)+126, హర్షవర్ధన్ రెడ్డికి.(4437)+159, పూల రవీందర్ (3115)+ 134 ఓట్లు వచ్చాయి. 15 మంది ఎలిమినేషన్ అభ్యర్దుల తరువాత శ్రీపాల్ రెడ్డి కి 6916, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 5205, హర్షవర్ధన్ రెడ్డికి 4799, పూల రవీందర్ కు 3617, పులి సరోత్తం రెడ్డికి 2645 ఓట్లు  వచ్చాయి.

More articles

Latest article