నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎస్ఎస్ఆర్ డిస్కవరీ పాఠశాలలో సోమవారం గ్రాండ్ పేరెంట్స్ డే కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థుల నాయనమ్మ, అమ్మమ్మలు రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకువచ్చి ప్రదర్శనలో ఉంచారు. అంతేకాక వారి మనమలు ,మనవరాండ్లతో కలసి నృత్య ప్రదర్శనలో పాల్గొని, చూపరులను ఆకట్టుకున్నారు. అలాగే గ్రాండ్ పేరెంట్స్ గా విచ్చేసిన వారు తమ విద్యార్థి

దశలోని అనుభవాలతోపాటు, విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులను సభావంగా వివరించారు. ఎస్ఎస్ఆర్ పాఠశాల ఎండి మారయ్య గౌడ్, సీఈవో హరిత గౌడ్, డైరెక్టర్ హర్షిత్ గౌడ్, ప్రిన్సిపల్ భాస్కర్ మెరీగ కార్యక్రమంలో పాల్గొని వంటలు చేయడంలో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి బహుమతుల అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు వచ్చిన గ్రాండ్ పేరెంట్స్ పాఠశాల యాజమాన్యానికి , ఉపాధ్యాయ బృందానికి మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
