బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలంలోని గౌరారం గ్రామములో దూడల ప్రదర్శన,పాల ఉత్పత్తి పోటీ శిబిరం రానికి విశేష స్పందన కలిగినట్లు పశువైద్య అధికారి సంతోష్ కుమార్ తెలిపారు. దూడల ప్రదర్శన, పాల ఉత్పత్తి పోటీ శిబిరం నిర్వహించడం జరిగింది. శిబిరానికి మండల పశువైదధికారి డాక్టర్ సంతోష్ కుమార్ దూడలకి నట్టల మందులు మరియు పాల ఉత్పత్తి పోటీ ఏ గేదెలు అయితే ఎక్కువ పాలు ఇస్తాయో వాటికి బహుమానము ఇవ్వడం జరిగింది.మొదటి రెండవది మూడవది బహుమతులు అందజేశారు. ఈ శిబిరానికి మండల పశువైద్యాధికారి దూడలకు నట్లల మందులు,రైతులకు బహుమానాలు అందజేశారు.పశుగణాభివృద్ధి సంస్థ నట్టల మందులు బహుమానాలు అందజేసినారు.ఈ శిబిరానికి గోపాలమిత్ర సూపర్వైజర్ తిరుపతి గోపాలమిత్ర సంగమేశ్వర్ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
