26.6 C
Hyderabad
Monday, August 3, 2026

పంట రక్షణ కు అమర్చిన విద్యుత్ కు గిరిజన మహిళ బలి

Must read

📰 Generate e-Paper Clip

 . . . ఘటన స్థలాన్ని సందర్శించిన కామారెడ్డి ఏఎస్పి

మాచారెడ్డి, బతుకమ్మ :

 

అడవి జంతువుల బారి నుంచి పంట రక్షణ కోసం అమర్చిన విద్యుత్ తీగలకు ఓ గిరిజన మహిళ బలైంది. ఈ ఘటన మాచారెడ్డి మండలం లచ్చ పేట గ్రామ శివారులో చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మాచారెడ్డి మండలం గజ్యా నాయక్ తండాకు చెందిన లావుడ్యొ పొరలి(50) అనే మహిళ పంట పొలం వద్ద విద్యుత్ తీగలు తగిలి మృతి చెందింది. ఘటనా  స్థలాన్ని కామారెడ్డి ఎస్పీ చైతన్య రెడ్డి, సిఐ రామన్, మాచారెడ్డి ఎస్ఐ అనిల్ కుమార్ సందర్శించారు. మృతురాలు ఇంటి నుంచి లచ్చపేట శివారుకు ఎందుకు వెళ్లిందనే వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

More articles

Latest article