28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

తెరుచుకున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు

Must read

📰 Generate e-Paper Clip

. . . 0.6 టీఎంసీల నీరు విడుదల

నిజామాబాద్, బతుకమ్మ :

 

గోదావరిపై మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ప్రతియేడాది జులై 1 నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ గేట్లను తెరిచి ఉంచే సాంప్రదాయం కొనసాగుతుంది.

Babli project gates open

ఈ నేపథ్యంలో శనివారం ఎస్సారెస్పీ బాబ్లీ ప్రాజెక్టు అధికారులు, సీడబ్ల్యూసీ అదికారులు కలిసి బాబ్లీ ప్రాజెక్టు గేట్లను తెరిచి 0.6 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ యూజీడీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, ఎస్సారెస్పీ ఈఈ చక్రపాణి, నాందేడ్ డిఈ ప్రశాంత్ కదం, ఎఈఈ రవికొత్త, సచిన్ దేవ్ కాంబ్లే, బాబ్లీ ప్రాజెక్టు అధికారులు వినయ్, సుశాంత్, రిక్కి తదితరులు ఉన్నారు.

Babli project gates open

More articles

Latest article