- అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
- ఎల్లమ్మకు బోనమెత్తిన అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అతిపురాతనమైన ఎల్లమ్మ ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అనానరు. నగరంలోని ఎల్లమ్మ గుట్టలో గల ఎల్లమ్మ ఆలయ దశమావార్షికోత్సవం సందర్భంగా ఎల్లమ్మ ఆలయ గుడి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బోనాల జాతర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు గత మూడు రోజులుగా పూజ, హోమం, నైవేద్యం కార్యక్రమాలు భక్తులందరు ఎంతో భక్తి శ్రద్దలతో నిర్వహించడం తెలంగాణ సంస్కృతికి

అద్దంపట్టేలా ఉందన్నారు. ఆది పరాశక్తి ఎల్లమ్మ ఆశీస్సులతో ఇందూర్ నగర ప్రజలందరు సుఖసంతోషాలతో, అష్ట ఐశ్వర్యలతో వెలుగొందాలని ఆశించారు. రైతులకు సకాలంలో వర్షాలు కురిసి రైతన్నలు అధిక పంటలు పండించాలని పిల్లజల్లా, గొడ్డు గోదా అన్నింటిని కాపాడాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పసుపుబోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మినారాయణ, కార్పొరేటర్ న్యాలం రాజు, బొబ్బిలి వేణుగోపాల్, రెంజర్ల నరేష్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

