వెబ్ న్యూస్, బతుకమ్మ : ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్ లో పాకిస్థాన్ 241 పరుగులకు అలౌటైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 49.4ఓవర్లలో 241 పరుగుల చేసి అలౌటైంది. పాకిస్థాన్ తరపున సయీద్ 62 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లు కులదీప్ 3 వికెట్లు, హార్థిక్ 2 వికెట్లు, అక్సర్ పటేల్,జడేజా, షమీ ఒక్కో వికెట్ సాధించారు. భారత్ కు 242 పరుగుల లక్ష్యన్ని పాకిస్థాన్ నిర్దేశించింది.
