25.3 C
Hyderabad
Tuesday, August 4, 2026

ఖాళీ బిందెలతో నిరసన

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలోని 3వ వార్డులో గత వారం రోజుల నుండి త్రాగునీరు రావడం లేదని, త్రాగు నీరు రాకపోవడం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని గురువారం కాలనీవాసులు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ..  గ్రామంలో గత వారం రోజుల నుండి త్రాగునీరు రావడంలేదని, త్రాగునీటి సమస్యపై గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రావణ్ కు విన్నవిస్తే పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరారు.

More articles

Latest article