ఖాళీ బిందెలతో నిరసన
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలోని 3వ వార్డులో గత వారం రోజుల నుండి త్రాగునీరు రావడం లేదని, త్రాగు నీరు రాకపోవడం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని గురువారం కాలనీవాసులు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. గ్రామంలో గత వారం రోజుల నుండి త్రాగునీరు రావడంలేదని, త్రాగునీటి సమస్యపై గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రావణ్ కు విన్నవిస్తే పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి...