26.6 C
Hyderabad
Monday, August 3, 2026

జువెలరీ షాప్ లో బంగారు నగల చోరీకి యత్నo

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఆజామ్ రోడ్ లో గల బంగారం దుకాణంలో ఓ మహిళ చోరికి యత్నించింది. ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగింది. బాన్సువాడకు చెందిన మహిళ బుర్కా ధరించి బంగారం దుకాణంలో బంగారు చెవి కమ్మలను  కొనుగోలుకు వచ్చింది. ఈ సందర్భంగా పలు డిజైన్లు చూసి నచ్చలేదని వెళ్లేందుకు యత్నించింది. ఆమె చేతీలో సెల్ఫోన్ కింద జత కమ్మలను ఉంచుకొని మెల్లిగా జారుకునేందుకు యత్నించింది. గమనించిన షాపు యజమాని పట్టుకుని రెండవ టౌన్ పోలీసులకు అప్పగించారు. సంబంధిత మహిళ బంగారు చెవి కమ్మల చోరీయత్నం దృశ్యాలు సీసీటీవీ రికార్డుల్లో నిక్షిప్తమయ్యాయి. ఈ మేరకు రెండో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని మహిళలను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

More articles

Latest article