30.9 C
Hyderabad
Monday, August 3, 2026

బీజేపీ గెలుపులో బీజేవైఎం పాత్ర కీలకం కావాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : ఈ నెల 27న జరిగే జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కీలక పాత్ర పోషించాలని బీజేవైయం రాష్ట్ర అధ్యక్షులు సెవేళ్ల మహేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు కులచారీ దినేష్ అన్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం  మంగళవారం నిజామాబాద్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పానుగంటి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ల మహేందర్  ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ…

BJYM's role should be crucial in BJP's victory

బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, ముఖ్యంగా విద్య, ఉపాధి, యువతాభివృద్ధి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని తెలిపారు. బిజేపి అభ్యర్థులు మల్కా కొమురయ్య, అంజిరెడ్డి బలమైన నాయకత్వం కలిగిన అభ్యర్థులుగా ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.శాసనమండలి లో ప్రశ్నించే గొంతుకలు ఉండాలనే ఆలోచనతో పార్టీ నాయకత్వం బలమైన అభ్యర్థులను నిలబెట్టింది అన్నారు. పట్టుభద్రులు, టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ని బీజేవైఎం కార్యకర్తలు ప్రతి ఒటర్ దగ్గరికి వెళ్లి మన అభ్యర్థుల గురించి వారికీ ఓటు వేసే విధంగా బీజేవైఎం కార్యకర్తలు పనిచేయాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు సంతోష్ నాయకుడు, రాష్ట్ర కార్యదర్శి మంత్రి సుదీర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదల నరేష్, పల్నాటి కార్తీక్, ఇందిరా ప్రియాంక, కుమల్లీ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆమంద్ విజయ్ కృష్ణ, పార్లమెంట్ కన్వీనర్ ఆశిష్, జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి శ్రీకాంత్, శ్రీధర్ గౌడ్, అసంబ్లీ కన్వీనర్ చిరంజీవి, మండల అధ్యక్షులు సురేష్, సాయికుమార్, అశోక్, ఐటీ కన్వీనర్ విపుల్ రావు తదితరులు పాల్గొన్నారు.

BJYM's role should be crucial in BJP's victory

More articles

Latest article