బీజేపీ గెలుపులో బీజేవైఎం పాత్ర కీలకం కావాలి
నిజామాబాద్ సిటి, బతుకమ్మ : ఈ నెల 27న జరిగే జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కీలక పాత్ర పోషించాలని బీజేవైయం రాష్ట్ర అధ్యక్షులు సెవేళ్ల మహేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు కులచారీ దినేష్ అన్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం మంగళవారం నిజామాబాద్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పానుగంటి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ల మహేందర్ ముఖ్య అతిథులుగా హాజరై...