రెంజల్, బతుకమ్మ: రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలోని త్రివేణి సంగమం వద్ద నిర్మిస్తున్న హెడ్గేవార్ కేశవ స్మృతి మందిరాన్ని మంగళవారం త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి సందర్శించారు. త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్మృతి మందిరం నిర్మాణం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని బీజేపీ నాయకులు, కేశవ సేవా సమితి సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కేశవ సేవా సమితి అధ్యక్షులు సుధాకర్ రెడ్డి ,కేశవ సమితి సభ్యులు, ఆర్ఎస్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
హెడ్గేవార్ స్మృతి మందిరాన్నిసందర్శించిన ఇంద్రసేనారెడ్డి
