27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

తాళం వేసిన ఇంట్లో చోరీ

Must read

📰 Generate e-Paper Clip

కుంభమేళాకు వెళ్లిన కుటుంబం

రూ. 40,000 నగదు, 2తులాల బంగారం  అపహరణ

నిజామాబాద్ క్రైమ్ బతుకమ్మ : నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్ లో ఒక ఇంటిలో చోరీ జరిగింది. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం వెలుగు చూసింది . కంఠేశ్వర్ బైపాస్ రోడ్ లో పి శేఖర్ అనే వ్యక్తి తన ఇంటిలోనే కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. సోమవారం కుటుంబ సమేతంగా కుంభమేళాకు ఇంటికి తాళం వేసి వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించి రూ.40,000 నగదు, రెండు తులాల బంగారం దోచుకెళ్లారు. మంగళవారం ఉదయం గేటు తాళం వేసింది వేసినట్టు ఉండి తాళం తెరిచి ఉండడంతో పొరుగింటివారు ఈ సమాచారాన్ని శేఖర్ కు అందించారు. ఆయన కుంభమేళాలో ప్రయాణంలో ఉండడంతో ఈ విషయాన్ని తన బంధువుకు తెలిపారు.  మంగళవారం మధ్యాహ్నం ఇంటికి చేరుకున్న వారి బంధువు ఈ విషయాన్ని రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ పోలీసులు గవర్నర్ బందోబస్తు పర్యటనలో ఉండడంతో ఘటన స్థలానికి ఎవరూ రాలేదు. డయల్ హండ్రెడ్ కు ఫోన్ చేసిన స్పందించేవారు కరువయ్యారని బాధితులు తెలిపారు.

More articles

Latest article