31 C
Hyderabad

ప్రయోగ పరీక్ష కేంద్రాల తనిఖీ 

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలోని  ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో రెండవ స్పెల్ ప్రయోగ పరీక్షలు జరుగుతున్న పరీక్ష కేంద్రాలను సోమవారం  జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ తనిఖీ చేశారు.  ప్రయోగ పరీక్షలు జరుగుతున్న ఇందల్వాయి మోడల్ జూనియర్ కళాశాల, వెక్టార్ జూనియర్ కళాశాల,  ఎస్సార్ జూనియర్ కళాశాల, ధర్మారంలోని సాంఘిక సంక్షేమ  కళాశాల, నారాయణ జూనియర్ కళాశాలలను  ఇంటర్ విద్య అధికారి తనిఖీ చేశారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజియుద్ధిన్ అస్లామ్, కనకమహాలక్ష్మి, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు జిల్లాలో మరో 10 కేంద్రాలను తనిఖీ చేశారు.  ప్రతి పరీక్ష కేంద్రంలో కెమెరాలు పనిచేస్తున్న విషయాన్ని స్వయంగా ఇంటర్ విద్య అధికారి పరిశీలించి సమీక్షించారు. ఇంటర్ విద్య అధికారి రవికుమార్ మాట్లాడుతూ ప్రతి పరీక్షా కేంద్రం లో  కెమెరాలకు జియో ట్యాగింగ్ పరిశీలించారు. కెమెరాలు  ఆగిపోకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ పని చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ లను ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో నిబంధనల మేరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. లైవ్ కెమెరాల ద్వారా  హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కమిషనర్ పర్యవేక్షణ చేస్తున్నారని అన్నారు.

Inspection of pilot test centres

More articles

Latest article