- వైస్ ఛాన్స్ లర్ ఆచారి టి.యాదగిరిరావు
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆరోగ్య విద్యను ప్రోత్సహించాలని వైస్ ఛాన్స్ లర్ ఆచారి టి.యాదగిరిరావు అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం, సూర్య ఆరోగ్య సంస్థ మధ్య మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అవగాహన ఒప్పంద పత్రాల పై తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి సూర్యాస్ హెల్త్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ చేకూరి ఉదయ సూర్యభగవాన్, కేదం రాజేంద్ర కుమార్ విక్రమ్ లు సంతకం చేశారు. ఈ సందర్భంగా వైట్ ఛాన్స్లర్టి యాదగిరిరావు మాట్లాడుతూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మార్గదర్శకాలకు కట్టుబడి ఆరోగ్య విద్య, కౌన్సెలింగ్ సేవలు, ఫిట్‌నెస్ కార్యకలాపాలు మరియు నిర్మాణాత్మక సంస్కరణ కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో మానసిక, భావోద్వేగ మరియు శారీరక శ్రేయస్సును పెంపొందించడమే ఈ భాగస్వామ్యం లక్ష్యం కావాలన్నారు. చైర్పర్సన్ చేకూరి ఉదయ సూర్య భగవాన్ మాట్లాడుతూ సూర్యాస్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది లాభాపేక్షలేని ఛారిటబుల్ ట్రస్ట్ (ఇండియా ట్రస్ట్ యాక్ట్), 1982 కింద రిజిస్టర్ చేయబడిన స్వచ్ఛంద సంస్థ, సమగ్రమైన, అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా ప్రజారోగ్యం మరియు శ్రేయస్సును మెరుగుపరచడానికి కట్టుబడి ఉందన్నారు. మానసిక ఆరోగ్య కార్యక్రమాలు, సాధారణ వైద్యం విద్య, తెలంగాణ విశ్వవిద్యాలయంలో స్టూడెంట్ సపోర్ట్ సెంటర్ ఏర్పాటు చేసి సమగ్ర విద్యార్థి ఆరోగ్య అభివృద్ధికి ఈ సంస్థ మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలోడీన్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రొఫెసర్ గంటా చంద్ర శేఖర్, ఆచార్య ఆంజనేయులు, సూర్యస్ హెల్త్ ఆర్గనైజేషన్ సభ్యులు డాక్టర్ రవితేజ ఇన్నమూరి, న్యూరో సైకియాట్రిస్ట్, ఆనంద్ మైండ్ కేర్, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
