- టీయుసీఐ రాష్ట్ర నాయకులు బి.మల్లేష్
భీమ్ గల్, బతుకమ్మ : సమాన పనికి సమానవేతనం అమలుచేసి, మున్సిపల్ వర్కర్స్ కు రూ.26వేల వేతనం ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (టీయుసీఐ) రాష్ట్ర నాయకులు బి.మల్లేష్ డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (టీయుసీఐ)ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ,ఔట్ సోర్సింగ్, ఎన్.ఎం.ఆర్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని భీమ్ గల్ మున్సిపల్ కమిషనర్ గంగాధర్ కు అందజేశారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (టీయుసీఐ) రాష్ట్ర నాయకులు బి.మల్లేష్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని లేదా ధరల పెరుగుదలకు అనుగుణంగా కనీస వేతనం రూ.. 26,000 లుగా నిర్ణయించి అమలు చేయాలని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, ఎన్.ఎం.ఆర్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, ప్రావిడెంట్ ఫండ్ లో గల తప్పులను సరిచేయాలని, ప్రతీ కార్మికుడికి ఈ. ఎస్. ఐ కార్డు ఇవ్వాలని.,కార్మికులకు ఈ. ఎస్. ఐ ఆసుపత్రిలో వైద్యం సరిగ్గా చేయడం లేదని , వైద్యం సరిగ్గా చేసేటట్లు మున్సిపల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని డిమాండ్ చేశారు.కార్మికులకు ప్రతినెల 1వ తారీకున జీతాలని ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమం లో టీయుసిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్. రమేష్, జిల్లా నాయకులు కె. రాజేశ్వర్,సీపీఐ (ఎం. ఎల్) మాస్ లైన్ డివిజన్ నాయకులు ఆర్. దామోదర్, మండల నాయకులు ఈ. రమేష్, మున్సిపల్ కార్మికులు జి.రాజన్న, ఎస్. ఒంకర్, సిఎచ్. వికాస్, కె. కిషన్, బి.మనోహర్ ఎస్. గంగవ్వ తదితరుల పాల్గొన్నారు.
