29.5 C
Hyderabad

కమిషనర్ ను కలిసిన సర్వ సమాజ్ కమిటీ

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : ఇటీవలే ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన పట్టణ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ ను స్థానిక సర్వ సమాజ్ కమిటీ మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్బంగా కమీషనర్ కు శాలువా తో సన్మానించి, పట్టణ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పట్టణం లో దోమల బెడద నివారణకు ఫాగ్గింగ్ చేయించాలని వినతి పత్రం అందజేశారు. స్పందించిన కమీషనర్ త్వరలోనే ఫాగ్గింగ్ చేయిస్తామని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమం లో సర్వ సమాజ్ ప్రెసిడెంట్ నీలం రవి, వైస్ ప్రెసిడెంట్ భార్ల మోహన్, ట్రెజరర్ కాపు కుమ్మరి హరీష్, రైటర్ పర్స నవీన్, సలహా కమిటీ సభ్యులుకర్నె మహేందర్,తోపారం సురేందర్,మహేష్ లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article