26.2 C
Hyderabad

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి

Must read

📰 Generate e-Paper Clip

  • చెత్త మున్సిపల్ వాహనాలకే అందించాలి
  • మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్

 

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులల్లో, అర్బన్ పార్క్ లల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ సూచించారు. మంగళవారం పట్టణం లోని వివిధ వార్డులను, అర్బన్ పార్క్ లను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్క్ లను పరిశుభ్రంగా ఉంచి, అందులోని మొక్కలకు నీరు పోయాలని సిబ్బందిని ఆదేశించారు. పట్టణ ప్రజలు ఇంట్లోని తడి, పొడి చెత్త మున్సిపల్ వాహనాలకే అందించాలని కోరారు. చెత్త ఎక్కడ దొరికితే అక్కడ పారావెయ్యద్దన్నారు. కమీషనర్ వెంట వార్డ్ ఆఫీసర్ కే. నవీన్, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ ఓంకార్, జవాన్ రాజయ్య, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article