బతుకమ్మ,మెండోరా: శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్, నీటి పారుదల శాఖ, సర్కిల్ డివిజన్ ఉద్యోగులు గురువారం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రం టీఎన్జీవోస్ ఎస్సారెస్పీ యూనిట్ అధ్యక్షులు ప్రవీణ్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు, ఈ సందర్బంగా దేశ స్వాతంత్ర్య కొరకు గాంధీ అహింసా మార్గంలో చేసిన పోరాటం గురించి వివరించారు. కార్యక్రమంలో డీఎస్ఈ లాల్ సింగ్ , డీ ఈ ఈ సుకుమార్ ,రఘుపతి, గణేష్, గంగా భూషణ్, శంకర్, సుపరిందేంట్లు, గోదావరి, రవీందర్, ఏ ఈ ఈ లు, మాణిక్యం, అక్తరుద్దీన్, భూమన్నా, సీనియర్ అసస్టెంట్ లు, జూనియర్ అసిస్టెంట్ లు తదితరులు పాల్గొన్నారు.
