24 C
Hyderabad
Sunday, August 2, 2026

ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

  • రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ : యువత ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని నిజామాబాద్  రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని శ్రావ్య గార్డెన్ లో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని అన్నారు. యువత తమ తల్లిదండ్రులను చైతన్యం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జీ సునీతా కుంచాల, అదనపు కలెక్టర్ అంకిత్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, జిల్లా రవాణా శాఖ కమిషనర్ దుర్గా ప్రమీల, ఏసీపీ రాజా వెంకట రెడ్డి, డీటీసీ ఉమా మహేశ్వర రావు, ఎంవీఐ కిరణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article