ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి
రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : యువత ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని శ్రావ్య గార్డెన్ లో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని అన్నారు. యువత తమ తల్లిదండ్రులను చైతన్యం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జీ సునీతా కుంచాల, అదనపు కలెక్టర్ అంకిత్, అదనపు డీసీపీ బస్వారెడ్డి,...