25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

రోడ్డు భద్రత మాసోత్సవాలు..

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఆర్మూర్: రోటరీ క్లబ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థిని విద్యార్థులకు రోడ్డు భద్రత మాసోత్సవాలులో భాగంగా అవగాహన సదస్సు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు రజనీష్ కిరాడ్ మాట్లాడుతూ.. పోలీసులు కనిపించినప్పుడే మనకు హెల్మెట్ ధరించాలని, సీటు బెల్టు పెట్టుకోవాలని గుర్తొస్తుంది అలా కాకుండా మనము ట్రాఫిక్ నియమాలను అలవాటు చేసుకుని ఎల్లప్పుడూ దాని పాటించి మన ప్రాణాలను మనం రక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్మూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్(ఎంవిఐ) వివేకానంద రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, ట్రాఫిక్ చట్టాలు, నియమాలను పాటించకుంటే జరిగే అనర్థాల గురించి ఒక గంట సేపు అవగాహన కల్పించి అందర్నీ మంత్రముగ్ధుల్ని చేశారు. తరువాత అపర్ణ హాస్పిటల్ డాక్టర్.ప్రకాష్ ఆర్థోపెడిక్ సర్జన్ మాట్లాడుతూ.. సంఘటన స్థలంలో యాక్సిడెంట్ తర్వాత మొదటి గంట సేపు లో వెంటనే క్షతగాత్రులను ఎలా రక్షించాలి ఏమేమి చేయాలి క్లుప్తంగా వివరించారు. ఆర్మూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్య నారాయణ మాట్లాడుతూ.. సోషల్ మీడియాను అతిగా వాడి మోసపోవద్దని, ఎవరికి నమ్మవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజ్ కరస్పాండెంట్ అల్జాపూర్ దేవేందర్ ప్రిన్సిపాల్ పాండేజీ, ట్రాఫిక్, రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ కే విద్యాసాగర్ జాతీయ రహదారి 44 ఇండిపెండెంట్ ఇంజనీర్ టి.రామారావు, డిచ్పల్లి టోల్ పే ప్రాజెక్ట్ మేనేజర్ అనిల్ కుమార్ సూచనలు సలహాలు చేశారు. ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి రాస ఆనంద్, ఖాన్దేష్ సత్యం, కాలేజీ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Road Safety Months

More articles

Latest article